: బిల్లులోని కొన్ని విషయాలపై సుప్రీంకోర్టుకు వెళతాం: అసదుద్దీన్ ఒవైసీ
లోక్ సభలో ఆమోదం పొందిన విభజన బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదుపై తాము సూచించిన సవరణలను సభలో పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదుపై అధికారాలన్నీ గవర్నర్ కు కట్టబెట్టారని... ఇది ప్రజాస్వామ్యబద్దం కాదని అన్నారు. హైదరాబాదుని ఉమ్మడి రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లును తాము వ్యతిరేకించడం లేదు కానీ, ఇందులో పొందుపరచిన కొన్ని అంశాలపై మాత్రం సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. సీమాంధ్రులు హైదరాబాదులో ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చని భరోసా ఇచ్చారు.