: చైనా, భారత్ ల తర్వాత 'యూట్యూబ్'అతి పెద్ద దేశమట..!
ఇంటర్ నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ అనుబంధ విభాగమైన యూట్యూబ్ ను నెలకు వందకోట్ల మంది దర్శిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. ఈ లెక్కన యూట్యూబ్ ను ఓ దేశం అనుకుంటే అది చైనా, భారత్ ల తర్వాత మూడో అతిపెద్ద దేశమని గూగుల్ తన బ్లాగులో చమత్కరించింది.
ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్ నెట్ వర్క్ లు విస్తరించడం, ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో నెటిజన్లు తరచుగా వీడియో సైట్లను వీక్షించడం సాధ్యమవుతోందని గూగుల్ చెబుతోంది. దాంతో, యూట్యూబ్ తో పాటు వివిధ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను సందర్శించే వాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఈ సెర్చింజన్ అభిప్రాయపడింది.