: అవినీతి మచ్చ లేని వ్యక్తి తెలంగాణ సీఎం కావాలి: విజయశాంతి
ఈ రోజు అద్భుతమైన రోజని, మరువలేని రోజని, 50 ఏళ్ల పోరాటం ఫలించిందని మెదక్ ఎంపీ విజయశాంతి చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎవరైనా సరే ఈ పోరాటంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. బిల్లు సభలో ప్రవేశించకుండా సీమాంధ్ర నేతలు ఎన్నో ఎత్తులు వేశారని.. కానీ, చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు. ఈ ఐదేళ్లలో తాను, కేసీఆర్ పార్లమెంటులో ఎంతో హుందాగా వ్యవహరించామని... సీమాంధ్ర నేతలు మాత్రం చాలా దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. సోనియాగాంధీని ఎంతోమంది ఎన్నో విధాలుగా తిట్టినా, ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని కొనియాడారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయ్యుండాలని, అవినీతి మచ్చ లేనివారయ్యుండాలని చెప్పారు. ఈ విజయం అమరవీరులకు అంకితమని చెప్పారు.