: కాంగ్రెస్, బీజేపీలు సభలో దుర్మార్గంగా వ్యవహరించాయి: ములాయం
కాంగ్రెస్, బీజేపీ కలసి పార్లమెంటులో దుర్మార్గంగా వ్యవహరించాయని సమాజ్ వాదీ నేత ములాయం సింగ్ ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకత తెలిపిన ఎస్పీ అధినేత, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి సభను ఇలా నిర్వహించడం సరికాదన్నారు. దేశ ప్రజలు చూడకుండా సభ నిర్వహించడం ఏమిటి? అని ములాయం ప్రశ్నించారు.