: పాకిస్థాన్ లో కూడా ఇలా చేయరు: జగన్


లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన వైఖరిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? లేదా? అనే సందేహం కలుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజని తెలిపారు. పాకిస్థాన్ లో కూడా ఇలా చేయరని చెప్పారు. ఒక నియంతలా బిల్లును ప్రవేశపెట్టి, సీమాంధ్ర ఎంపీలెవరూ సభలో లేకుండా చేసి... బిల్లును ఆమోదించారని అన్నారు. ఇలాంటి పోకడ సరైందేనా అని ప్రశ్నించారు. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి చంద్రబాబు వరకు ఈ వ్యవహారంలో అంతా దోషులేనని చెప్పారు.

  • Loading...

More Telugu News