: బిల్లు ఆమోదానికి రెండు గంటల సమయం పట్టింది: ఎంపీ నామా
లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడానికి రెండు గంటల సమయం పట్టిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. సభ వాయిదా అనంతరం బయట మీడియాతో మాట్లాడిన నామా, క్లాజ్ ల వారీగా బిల్లుపై ఓటింగ్ జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో నిలుపుదామన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు జాతి కలసి ఉండాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే, సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందేనన్నారు.