: భారత టూరిస్టులకు ఫిలిప్పీన్స్ వల!
ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్ పర్యాటకం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా భారత్ నుంచి టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు వినూత్న ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తోంది. పర్యాటకం ద్వారా లభించే ఆదాయంలో 43 శాతం పెరుగుదల లక్ష్యంగా ఈ ఏడాది ముందుకెళ్ళనున్నట్టు ఫిలిప్పీన్స్ అధికారి ఒకరు చెప్పారు.
గత ఏడాది ఫిలిప్పీన్స్ ను 46000 మంది భారత పర్యాటకులు సందర్శించారట. ఈ ఏడాది ఆ సంఖ్యను 66,000 కు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ తెలిపింది. వ్యాపార పరంగానూ, సమావేశాల నిర్వహణ పరంగానూ ఫిలిప్పీన్స్ అనుకూలంగా ఉంటుందని.. అదే సమయంలో బాలీవుడ్ షూటింగ్ లకు తమ దేశం చక్కగా అతికినట్టు సరిపోతుందని కూడా పర్యాటక శాఖ హామీ ఇస్తోంది.