: అయ్యో.. రేఖ ముఖంపై ముడతలా..!


అలనాటి అందాల నటి రేఖ ఇప్పటికీ బాలీవుడ్ లో కొందరికి కలల రాణే. ఏవో ఊసులు చెబుతున్నట్టుండే కళ్ళు, ముద్దొచ్చే పెదవులు, నిండైన సౌష్టవం వెరసి.. రేఖ. ఇంతటి రమణీయ లలామ ఇన్నేళ్ళొచ్చినా వార్ధక్యం చాయలు కనిపించకుండా ఎలా మెయింటైన్ చేస్తుందనేది ఇప్పటికీ కొందరికి అర్థంకాని విషయం. అంతటి సౌందర్య రాశి కూడా వయసు ప్రభావం ముందు ఓడిపోక తప్పలేదు. ఇటీవలే 'హైవే' సినిమా ప్రీమియర్ షోకు హాజరైన రేఖను చూస్తే 'ఏదీ ఆనాటి సొగసు' అని సగటు అభిమాని కచ్చితంగా బాధపడకమానడు. పెద్దగా మేకప్ వేసుకోకుండానే ఆ స్క్రీనింగ్ కు విచ్చేసిన రేఖ ముఖంపై ముడతలు, కళ్ళ కింద వలయాలు స్పష్టంగా కనిపించాయి. హాఫ్ వైట్ కుర్తా, చుడీదార్లో పెద్ద వయసు స్త్రీలా కనిపించింది. థియేటర్ వద్ద ఆమెను చూసినవాళ్ళు, తాము చూస్తున్నది ఆ రేఖనేనా అనుకున్నారట. ఇన్నాళ్ళూ హెవీ మేకప్ తో మేనేజ్ చేసిన ఈ దక్షిణాది సుందరి ఇక తన సౌందర్య పోషణకు స్వస్తి చెప్పిందనుకోవాలేమో!

  • Loading...

More Telugu News