: అందరం కలిసుందాం.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: కేటీఆర్
సీమాంధ్ర మిత్రులకు ఒక్కటే చెబుతున్నా... ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, అందరూ కలసి ఉందామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పారు. అలాగే తెలంగాణ మిత్రులు కూడా సంయమనంతో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యవాదుల విజయం అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పారు.