: కేసీఆర్, జయశంకర్ ల విజయం.. హైదరాబాదులో అందరూ హాయిగా ఉండొచ్చు: హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కలిసింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ విజయం కేసీఆర్, జయశంకర్ లదే అని చెప్పారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ నగరంలో అందరూ హాయిగా బతకవచ్చని చెప్పారు. కోట్లాదిమంది తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేసిందని... ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.