: వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభం
మూడవసారి వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభమైంది. సభ మొదలైన వెంటనే సీమాంధ్ర కేంద్ర మంత్రులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడే పరిస్థితి నెలకొంది. అయితే, బడ్జెట్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చచేపడతారని తెలుస్తోంది.