: 'బుల్లెట్ రాజా'కు ఎయిర్ పోర్టులో అవమానం!
బాలీవుడ్ సొగసుకాడు సైఫ్ అలీ ఖాన్ కు అవమానం జరిగింది. తిగ్మాంశు దూలియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బుల్లెట్ రాజా' చిత్రీకరణలో పాల్గొనేందుకు సైఫ్ ఈరో్జు లక్నో చేరుకున్నారు. అయితే, అక్కడి విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో సైఫ్ కు ప్రవేశం నిరాకరించారు. ఆ లాంజ్ కేవలం ప్రభుత్వ జాబితాలో ఉన్న వ్యక్తులకేనని అధికారులు గట్టిగా చెప్పడంతో సైఫ్ అవమానంగా ఫీలయ్యాడట. ఇక చేసేందుకేమీలేక వెంటనే సైఫ్ అక్కడినుంచి నిష్క్రమించినట్టు సమాచారం.