: సీమాంధ్రలో హై అలర్ట్


రాష్ట్ర విభజన అంశం క్లైమాక్స్ కి చేరిన నేపథ్యంలో నేడు సీమాంధ్రలో హై అలర్ట్ ప్రకటించారు. బిల్లుపై నేడు లోక్ సభలో చర్చ ఆరంభం కాగా, సాయంత్రానికి ఆమోదింపజేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. దీంతో, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర పోలీస్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విభజనకు ఆమోద ముద్ర పడితే సీమాంధ్రలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. విజయవాడ, కడప, అనంతపురం, విజయనగరం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించాలని సూచించింది.

  • Loading...

More Telugu News