: ఈమెయిల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుసుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఒక ప్రాంతం నుంచి ఒక వ్యక్తి అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న సోదరుడికో, స్నేహితుడికో లేదా ఒక కంపెనీకో మెయిల్ పంపించాడు. తన కంప్యూటర్ నుంచి మెయిల్ సెండ్ చేసిన తర్వాత.. అది ఎక్కడి నుంచి ఎలా, ఎంత దూరం వెళ్లిందో ఇప్పటి వరకు తెలిసే అవకాశం లేదు. కానీ, ఇకపై అధి సాధ్యమే. జీపీఎస్ సాంకేతికత సాయంతో ఇలా మెయిల్ ను ట్రాక్ చేసి దాని దూరాన్ని చెప్పే సాఫ్ట్ వేర్ ను జోనాబ్రుక్కర్ అనే అతను రూపొందించాడు. దీని సాయంతో కంప్యూటర్ స్క్రీన్ పైనే అది ఎక్కడి నుంచి ఏ మార్గంలో ఎంత సమయంలో వెళ్లిందో తెలుసుకోవచ్చు.