: ఈ దిండు ఉంటే గురక దూరం!
గుర్రు.... గుర్రు.... ఇలా పక్కన గురకపెట్టే వారుంటే కొందరికి జాగారమే. నిద్ర పట్టనుగాక పట్టదు. ఒకే మంచంపై నిద్రించే జీవిత భాగస్వాముల్లో ఇద్దరికీ గురకలక్షణం ఉంటే ఫర్లేదు కానీ, ఒక్కరికే ఉంటే మాత్రం మరొకరికి నరకమే. ఈ నేపథ్యంలో గురక బాధితుల కోసం ఇల్లినాయిస్ కు చెందిన హమ్మచెర్ ష్లెమ్మర్ అనే పరికరాల సంస్థ ఒక దిండును తయారు చేసింది.
ఈ దిండును గురక అలవాటున్నవారు తలగడగా పెట్టుకోవాలి. సాధారణంగా గురక విడతల వారీగా వస్తుంది. ఈ దిండులో మైక్రోఫోన్ ఉంటుంది. గురక పెట్టగానే ఆ శబ్ధంతో మైక్రోఫోన్ అలర్ట్ అవుతుంది. వెంటనే తలకింద దిండు మూడు అంగుళాల మేర ఉబ్బిపోతుది. దీంతో పడుకున్న వారు కదిలిపోతారు. దాంతో గురక ఆగిపోతుంది. మళ్లీ గురకపెట్టినా ఇదే పరిస్థితి. గురుక తక్కువ శబ్దంతో వచ్చినా ఇది గుర్తించగలదు. కొందరు మొద్దు నిద్రపోతారు.. అలాంటి వారిని ఈ దిండు ఏమీ చేయలేదేమో?