: సర్కారుది అహంకార ధోరణి: కేసీఆర్


సడక్ బంద్ సందర్భంగా తెలంగాణ వాదులను అరెస్టు చేసిన ప్రభుత్వం తన అహంకార ధోరణిని చాటుకుందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల, జూపల్లి, జితేందర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు.

సర్కారు వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పదవ తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేవలం నిరసనలతోనే సరిపెడతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. పరీక్షల కారణంగా తెలంగాణ బంద్ కు పిలుపునివ్వలేదని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News