: తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు
సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విభజన బిల్లును ఎలాగైనా ఈ రోజు ఆమోదింపచేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తుండగా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిరసనను రెట్టింపు చేశారు. వీరికి సీపీఎం నేతలు కూడా జత కలిశారు. వారికి తమిళనాడు ఎంపీలు జతకూడడంతో (తమిళ జాలర్ల కోసం) లోక్ సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. దీంతో లోక్ సభ వాయిదా పడింది. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో, రాష్ట్ర విభజన సులువనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం అంచనాలను తల్ల కిందులు చేస్తూ సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా వెల్ లోకి దూసుకొచ్చి విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూజువాణి ఓటుతోనైనా సరే బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది.