: ఖతార్ లో భారతీయుల మృత్యుగీతం


అధిక సంపాదన మోజుతో గల్ఫ్ దేశాల బాట పడుతున్న భారతీయుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. కొందరు దిక్కూమొక్కూ లేకుండా అక్కడే కడతేరి పోతున్నారు. ముఖ్యంగా ఖతార్ దేశం మనవాళ్ళ పాలిట మృత్యుకుహరంగా మారుతోంది. 2012-13లో అక్కడ మరణించిన భారతీయుల సంఖ్య 450. ఏఎఫ్ పీ వార్తా సంస్థ ఖతార్ లోని భారత దౌత్య కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఈ వివరాలు రాబట్టింది. అయితే, వారందరూ ఎందుకు, ఎలా మరణించారన్న వివరాలు మాత్రం భారత ఎంబసీ అందజేయలేదు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంస్థలు ఖతార్ లో వలసదారులను, కూలీలను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి. 2022లో ఖతార్ సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అందుకుగాను స్టేడియాలను ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ సమయంలో కూలీలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల సంస్థలు ఎలుగెత్తాయి. దీనిపై ఖతార్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

  • Loading...

More Telugu News