: విశాఖలో 'ఇంటింటా అన్నమయ్య' ఆడియో ఆవిష్కరణ
అన్నమయ్య సంకీర్తనలకు ప్రాచుర్యం కల్పించాలనే సదుద్దేశంతో తీసిన 'ఇంటింటా అన్నమయ్య' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఆర్కే బీచ్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు తనయుడు రేవంత్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు.
సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, వేల్ రికార్డ్స్ ద్వారా ఆడియోను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అనన్య, సోనమ్ షెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.