: బాగా ఆడాం: ధోనీ
న్యూజిలాండ్ లో ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేకపోయినా భారత క్రికెట్ జట్టు సారధి తమ ఆట తీరును సమర్ధించుకున్నాడు. జట్టు ప్రదర్శన పూర్తిగా బాగుందంటూ కితాబిచ్చుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో 0-4, రెండు టెస్టుల సిరీస్ ను 0-1 తేడాతో ధోనీ సేన కివీస్ పాలు చేసిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. 'మొత్తం మీద బాగా ఆడాం. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మెరుగుపడుతున్నాం. ఇప్పుడు మంచి ఆటతీరును ప్రదర్శించాం' అని చెప్పాడు.