: క్యాలికట్ నిట్ మూసివేత.. తెలుగు విద్యార్థి మృతి ఘటనే కారణమా?


కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విద్యాసంస్థను సోమవారం నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు విద్యాసంస్థ రిజిస్ట్రార్ నిన్న రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు తెరిచేదీ వెల్లడించలేదు. మంగళవారం ఉదయం 10 గంటల కల్లా హాస్టళ్లు ఖాళీ చేయాలని, ఆ తర్వాత ఎవరైనా ఉంటే చర్యలు తీసుకుంటామని విద్యార్థులను ఆదేశించారు. ఈ నిట్ లో ఆరు వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వీరిలో వెయ్యి మంది వరకు తెలుగు విద్యార్థులున్నారు.

ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామానికి చెందిన మన్నం వెంకటేశ్వర్లు క్యాలికట్ లో ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం కళాశాల ఆవరణలో టెన్నిస్ ప్రాక్టిస్ గోడ కూలి మృతి చెందాడు. అతని కుటుంబానికి పరిహారం ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థి చనిపోయిన రోజునే డైరెక్టర్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం నాడు డైరెక్టర్, రిజిస్ట్రార్, డీన్ లు సమావేశమై చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. కళాశాల భవనాలు పాతబడ్డాయని, అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన చేశారు. నిట్ భవనాలపై డేంజర్ అని రాశారు. కళాశాలలో కనీసం అత్యవసర సమయంలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారని గుర్తించిన నిట్ యాజమాన్యం నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

  • Loading...

More Telugu News