: పులికి వేటాడే అవకాశమిచ్చిన సాహసి
సాహసం చేయదవురా డింభకా అన్న పాతాళభైరవి డైలాగ్ గుర్తొచ్చిందేమో? ఓ చైనీయుడు చేసి చూపించాడు. 27 ఏళ్ల యాంగ్ జిన్హి సిచువాన్ ప్రావిన్స్ లోని చెంగ్డు జూలో బెంగాల్ పులల బోనులోకి దూకాడు. రెండు పులుల ముందుకెళ్లి నించున్నాడు. వాటిలో ఒక పులి గోళ్లతో పంజా విసిరి గాయపరిచింది. అవి అతడిని చంపి తినే లోపే సిబ్బంది ప్రమాదాన్ని తప్పించారు. మత్తు మందుతో వాటి నుంచి జిన్హిని రక్షించారు. పిచ్చోడివా.. ఎందుకిలా చేశావ్? అంటే.. అడవుల్లో సహజంగా తిరగాల్సిన వాటిని తీసుకొచ్చి జూలోని బోనుల్లో బంధించారు. దాంతో సహజంగా జంతువులను వేటాడి తినే అవకాశం వాటికి లేకుండా పోయింది. అందుకే వాటికి ఆ అనుభవాన్ని, అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో స్వచ్చందంగా బోనులోకి వెళ్లాను అని జిన్హి తన జాలి మనసును చాటుకున్నాడు.