: మూజువాణి ఓటుకు ఒప్పుకోం: జైరాంకు స్పష్టం చేసిన బీజేపీ నేతలు


పార్లమెంటులో బీజేపీ నేతలతో జైరాం రమేష్ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన బిల్లుపై వారు చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో మూజువాణి ఓటుతో విభజన బిల్లును పాస్ చేయడానికి తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వాలని తేల్చిచెప్పారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు బదలాయించాలని కోరారు. భద్రాచలం డివిజన్ లోని 7 మండలాలను సీమాంధ్రలో కలపాలని స్పష్టం చేశారు. కొత్త రాజధానికి నిధులను సభాముఖంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని చెప్పింది.

  • Loading...

More Telugu News