: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం, మధ్యాహ్నానికి వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటి క్రితమే లోక్ సభ ప్రారంభమైంది. ప్రారంభమైన వెనువెంటనే సభ్యులు నినాదాలు చేయడంలో స్పీకర్ మీరాకుమార్ లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.