: దేశానికి ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు?: కాంగ్రెస్ పై మండిపడ్డ బాబు


ఇతర రాష్ట్రాలలో ఉమ్మడి రాజధాని ఏర్పాటు చేసిన దాఖలాలు ఇంతవరకు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీ తిరస్కారానికి గురైందన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణించలేదని విమర్శించారు. ఇంత పెద్ద విషయాన్ని కేవలం టేబుల్ ఐటెంగా తీసుకొస్తారా అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుప్రాంత సమస్యలను పరిష్కరించాలని మొదట్నుంచి చెబుతున్నామని... ఈ విషయంలో రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ నేతలను కూడా కలిశామని చెప్పారు. తమకు ఇష్టమైన వారిని అందలమెక్కించే కాంగ్రెస్, తమకు ఇష్టం లేని వారిని సభ నుంచి సస్పెండ్ చేయిస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి, బిల్లును ఆమోదించడం ద్వారా దేశానికి ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం తెలుగువారి సమస్యే కాదని... దేశ సమస్య అని చెప్పారు.

  • Loading...

More Telugu News