: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన హర్షకుమార్
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు తుది ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ హర్షకుమార్ యూపీఏ ప్రభుత్వంపై ఈ రోజు అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చారు. దీంతో పాటు, సస్పెండైన ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ మరో నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు.