: రేపు విభజన బిల్లుపై చర్చ, ఓటింగ్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. 4 గంటలపాటు చర్చ జరిగిన అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. విభజన బిల్లును ఆమోదింపజేసేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులను, ఎంపీలను కేంద్ర ప్రభుత్వం మానసికంగా సిద్ధం చేసింది. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.