: సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాతే బిల్లు ప్రవేశపెట్టాలంటున్న మోదుగుల


లోక్ సభ నుంచి సస్పెండ్ చేసిన తమపై బహిష్కరణ నిర్ణయం ఎత్తివేసిన తర్వాతే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ అన్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తమకు పార్టీల కన్నా ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ సబ్బం.. రాహుల్ ఈ సాయంత్రం సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు ఫోన్ చేసి భేటీకి పిలవడంపై స్పందించారు. రేపు సభలో బిల్లుపై చర్చ సందర్భంగా సీమాంధ్ర నేతలు గొడవ చేయకుండా ఉండాలని సూచించేందుకే ఆయన వారితో భేటీ అయి ఉంటాడని అభిప్రాయపడ్డారు. గత గురువారం విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఏర్పడిన ఘర్షణ కారణంగా 18 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News