: జగన్ అరెస్ట్... డీసీపీ కార్యాలయానికి తరలింపు
పార్లమెంటు ముట్టడికి బయల్దేరిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. జంతర్ మంతర్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పార్లమెంటు దిశగా దూసుకెళుతున్న జగన్ తో పాటు ఇతర కార్యకర్తలను కూడా బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా వారు అక్కడి నుంచి కదలకపోవడంతో జగన్ ను అరెస్టు చేసి, డీసీపీ కార్యాలయానికి తరలించారు. తమ అధినేత అరెస్టుకు నిరసనగా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.