: బొత్స నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ.. సీఎం సమావేశానికి పోటీగానేనా..?


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రులు సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి, కన్నా, రఘువీరారెడ్డి, బాలరాజు, ఎమ్మెల్యేలు కమల, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటికి హాజరైన వారందరూ సీఎం వ్యతిరేక వర్గంగా ముద్రపడిన వారే. నిన్న సీఎం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన భేటీకి పోటీగానే బొత్స నివాసంలో వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది. కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వస్తున్న వార్తలపై వారు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News