: తెలంగాణ పేరుతో సీమాంధ్రకు అన్యాయం చేయకండి: అద్వానీ


రాష్ట్ర విభజనకు జెట్ స్పీడుతో దూసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బ్రేకు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ అగ్రనేత అద్వానీ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని... అయితే తెలంగాణ పేరుతో సీమాంధ్రులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. సీమాంధ్రుల సమస్యలను గాలికి వదిలేయరాదని తెలిపారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు ప్రాంతాల వారికి న్యాయం జరగాలని కోరారు. ఇరు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచిన తర్వాతే రాష్ట్ర విభజన జరగాలని సూచించారు.

  • Loading...

More Telugu News