: ఈ సాయంత్రానికి సీఎం రాజీనామా: డీఎల్ జోస్యం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి జోస్యం చెప్పారు. ఈ సాయంత్రం కల్లా తన పదవికి రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కడప జిల్లాలో డ్వాక్రా మహిళలతో డీఎల్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నారు. రాజకీయ అనిశ్చితి వల్ల రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్న ఆయన డ్వాక్రా రుణాల రద్దు పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News