: తమిళనాడు కంటే ఎదిగిపోతున్నామని చిదంబరం కుట్ర చేశారు: లక్ష్మీ పార్వతి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు కంటే ఎదిగిపోతోందన్న అక్కసుతోనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనకు సోనియాతో కలసి కుట్ర చేశారని వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తెలుగుజాతి ఐక్యత కోసం ఎన్టీఆర్ తర్వాత జగన్ మాత్రమే పాటుపడుతున్నారని తెలిపారు. తెలుగువాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదని... అతి మంచి వారని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని విమర్శించారు. ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన సమైక్య ధర్నాలో ఆమె ప్రసంగించారు.

  • Loading...

More Telugu News