: పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
తమ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈ వారమంతా పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని, ఏ ఒక్కరూ గైర్హాజరు కాకూడదని తెలిపింది. తెలంగాణ బిల్లుపై రేపు చర్చించే అవకాశం ఉన్నందున, ఎలాగయినా సభలో బిల్లును ఆమోదింపజేయాలని చూస్తున్న కాంగ్రెస్ ఈ మేరకు విప్ జారీ చేయడం గమనార్హం.