: గాలి జనార్దన రెడ్డికి తాత్కాలిక బెయిల్
అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన రెడ్డికి ఐదు రోజుల తాత్కాలిక బెయిల్ లభించింది. వెన్ను నొప్పి కారణంగా తీవ్రంగా బాధపడుతున్న గాలి చికిత్స చేయించుకునేందుకు బెయిల్ కోరడంతో బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఐదు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని గాలికి సూచించింది.