: తమిళనాడు ఆర్టీసీ ఉద్యోగుల గిన్నిస్ బుక్ రికార్డ్


తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఎలాగంటారా.. ఇటీవల సీఎం జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ఆర్టీసీ ఓ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. మొత్తం 53,129 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఈ శిబిరంలో పాలుపంచుకున్నారు. ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో రక్తదానం చేసిన దాఖలాల్లేకపోవడంతో ఇది కాస్తా గిన్నిస్ రికార్డుగా నమోదైంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను గిన్నిస్ బుక్ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రి జయలలితకు అందించారు.

  • Loading...

More Telugu News