: బీజేపీ అగ్రనేతలతో ముగిసిన షిండే, జైరాం రమేష్ ల భేటీ
రేపు తెలంగాణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో, బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు షిండే, జైరాం రమేష్ లు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందడానికి సహకరించాల్సిందిగా కోరారు. అయితే, బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరిగితేనే తాము సహకరిస్తామని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు. బిల్లులోని అంశాలన్నింటిపై స్పష్టత ఉంటేనే తాము మద్దతిస్తామని తెలిపారు. వీరి మధ్య ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. అయితే, సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేసే అంశంలో ఇరు పార్టీల నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.