: టోల్-ప్రీ సేవలు ప్రారంభించిన హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ టోల్-ప్రీ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించింది. ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసులో ఆరు ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్) నితిన్ చుగ్ చెప్పారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్ మెంట్ సమాచారాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా ఖాతాదారులకు అందిస్తామని ఆయన చెప్పారు.
మొబైల్ బ్యాంకింగ్ యాప్ డౌన్ లోడ్, చెక్ బుక్ రిక్వెస్ట్, అకౌంట్ స్టేట్ మెంట్, ఇ-మెయిల్ స్టేట్ మెంట్ వంటి మరో 4 సర్వీసులను వినియోగదారులు పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ సర్వీస్ ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సర్వీసును బేసిక్ మొబైల్ హ్యాండ్ సెట్ ద్వారా కూడా రాత్రీ, పగలు ఎప్పుడైనా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లేదా దగ్గరలోని బ్యాంక్ శాఖలో నమోదు చేసుకోవడం ద్వారా ఈ టోల్-ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసును పొందవచ్చని నితిన్ తెలిపారు.