: క్వార్టర్స్ కి దూసుకెళ్ళిన కుర్రాళ్ళు


యువ భారత్ జట్టు అండర్-19 వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. దుబాయ్ లో నేడు స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత స్కాట్లాండ్ ను 88 పరుగులకే పరిమితం చేసిన కుర్రాళ్ళు.. లక్ష్య ఛేదనలో తడబడ్డారు. ఓ దశలో 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును సర్ఫరాజ్ ఖాన్ (45 నాటౌట్), దీపక్ హుడా (24 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు అజేయంగా 70 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. భారత్ తన తొలి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News