: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కథ ముగిసింది.. సీఈవో రాజీనామా
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కథ ముగిసింది. సీఈవో సంజయ్ అగర్వాల్ తన రాజీనామా లేఖను యాజమాన్యానికి అందజేశారు. కంపెనీ నుంచి తప్పుకున్న చివరి అధికారి అగర్వాలే. ఆర్ధిక కారణాలతో 2012 అక్టోబరులో విమాన సేవలకు స్వస్తి పలికిన కింగ్ ఫిషర్ సంస్థ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు బకాయి పడింది. ఈ దేశీ విమానయాన సంస్థ లైసెన్స్ ను డైరక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొంతకాలం కిందట రద్దు చేసింది.