: గుండెపోటును గుర్తించే పరికరంపై 'ఆపిల్' కసరత్తు


టెక్నో జెయింట్ 'ఆపిల్' సంస్థ మరో సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించేందుకు సీరియస్ గా కృషి చేస్తోంది. ఈ నవీన ఉత్పాదన గుండెపోటు ముప్పును ముందే గుర్తిస్తుందని ఆపిల్ వర్గాలు తెలిపాయి. మన శరీరంలోని రక్తం ప్రవహించే సమయంలో వెలువడే సవ్వడి ఆధారంగా ఈ వైద్యోపకరణం హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తుందట. టీహెచ్ఎక్స్, 10.2 సౌండ్ సిస్టమ్ ఆవిష్కర్త, ప్రఖ్యాత సౌండ్ ఇంజినీర్ టామ్లిన్సన్ హాల్మన్ కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్నట్టు ఆపిల్ తెలిపింది. ఈ పరికరం అందుబాటులోకి వస్తే హృద్రోగ సంబంధ వ్యాధులతో మరణించే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుందనడంలో సందేహం అక్కర్లేదు.

  • Loading...

More Telugu News