: వీధినాటకం మాటున విచ్చలవిడి నృత్యాలు


అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో ఏం జరిగిందో చూడండి. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గతరాత్రి వీధి నాటకం ప్రదర్శించారు. అయితే, అది వీధి నాటకం కాదని, అశ్లీల నృత్యాల సమాహారం అని కాసేపటికే చూసినవాళ్లకు రూఢీ అయింది. విషయం ఎలాగో పోలీసులకు చేరింది. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు వేదికపైకెక్కి లైట్లు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. దీంతో, తమ ఆనందాన్ని భగ్నం చేసిన పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. వారిపై కర్రలు, రాళ్ళతో విరుచుకుపడ్డారు. అంతేగాకుండా పోలీసులకు చెందిన రెండు బైక్ లను తగలబెట్టారు. చివరికి సీఐ రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ వీధినాటకం పేరు.. బెబ్బులి రాయుడట!

  • Loading...

More Telugu News