: రిలయన్స్ కు నవ యవ్వన వారసుడు


32 ఏళ్ల క్రితం తన తండ్రి ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ముకేశ్ అంబానీ యువకుడిగా అడుగుపెట్టాడు. నేడు భారత్ లోనే అత్యంత నికర విలువ కలిగిన గ్రూపుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ను నిలిపారు. భారతీయ కుబేరుడు కూడా ముకేశే. ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని ఆకాశ్ అంబానీ కూడా రెండు పదుల వయసులోనే రిలయన్స్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. త్వరలో 4జీ సర్వీసులను ఆరంభించనున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వ్యవహారాలను దగ్గరుండి తెలుసుకుంటున్నాడు. కంపెనీ సమావేశాల్లో తండ్రితో కలిసి పాల్గొంటున్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో కలిసి పని చేస్తున్నాడని వెల్లడించాయి. అయితే, అకాశ్ పాత్రను బయటపెట్టకుండా ముకేశ్ గోప్యత పాటిస్తున్నారు.

ముకేశ్ అంబానీకి కొడుకులు, ఆకాశ్, అనంత్, కూతురు ఇషా ఉన్నారు. అందరిలోకీ ఆకాశే పెద్దవాడు. ధీరూభాయ్ మరణానంతరం రిలయన్స్ సామ్రాజ్యాన్ని ముకేశ్, అనిల్ అంబానీలు పంచుకున్న విషయం తెలిసిందే. ముకేశ్ కు పెట్రో కెమికల్స్ వ్యాపారం, అనిల్ కు ఆర్థిక, టెలికాం సేవల కంపెనీలు (అనిల్ ధీరూభాయ్ గ్రూపు) వెళ్లాయి. అనంతరం కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు కంపెనీల విలువ అప్రతిహతంగా పెరుగుతూ పోగా.. అనిల్ కంపెనీల విలువలో ఏమంత ఎదుగుదల లేదు. అయితే, ఆకాశ్ అంబానీ తండ్రికి తగ్గ తనయుడా? లేక తండ్రిని మించిన తనయుడా? అన్నది కొంత కాలం ఆగితేకానీ తెలియదు.

  • Loading...

More Telugu News