: సోనియాపై విమర్శలు గుప్పించిన జగన్
రాజకీయ లబ్ది కోసమే సోనియా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన పార్టీ శ్రేణులతో కలిసి జగన్ నేడు ధర్నాకు దిగారు. రాహుల్ ను ప్రధానిని చేయడమే కాంగ్రెస్ అజెండా అని, విభజన ద్వారా తెలంగాణలో కొన్ని సీట్లు కొట్టేయాలన్నది వారి వ్యూహమని జగన్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇటాలియన్ నేషనల్ కాంగ్రెస్ లా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇక, లగడపాటి పెప్పర్ స్ప్రే ఉదంతంపైనా స్పందించారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర అని అభివర్ణించారు.