: 'తెహల్కా' ఎడిటర్ పై అత్యాచార అభియోగం


'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంలో గోవా పోలీసులు ఈ రోజు ప్రిన్సిపల్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి అనుజ ప్రభుదేశాయ్ ఎదుట చార్జ్ షీట్ దాఖలు చేశారు. తెహల్కా పత్రికలో పనిచేసే మహిళా జర్నలిస్టుపై గోవాలోని ఓ హోటల్ లిఫ్టులో అత్యాచారానికి పాల్పడేందుకు తేజ్ పాల్ యత్నించినట్లు అభియోగం నమోదు చేశారు. అంతేకాక ఈ కేసులో అరెస్టును అడ్డుకునేందుకు తేజ్ పాల్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తగిన ఆధారాలు రికార్డు రూపంలో ఉన్నాయని చార్జ్ షీటులో పేర్కొన్నారు. మొత్తం 2,684 పేజీలతో సమర్పించిన నివేదికలో బాధితురాలు, తెహల్కా పత్రిక సిబ్బంది, దర్యాప్తు అధికారి సహా 152 మంది సాక్షులను పేర్కొన్నారు. గతేడాది నవంబరు 30న అరెస్టయిన తెహల్కా ఎడిటర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో గోవాలోని సదా సబ్ జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News