: తామేం పాపం చేశామంటున్న పాక్ టి20 కెప్టెన్


పాకిస్థాన్ టి20 జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తామేం పాపం చేశామని ఐపీఎల్ లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్నించాడు. ఏళ్ళ తరబడి పాకిస్థాన్ ఆటగాళ్ళు ఐపీఎల్ లో ఆడేందుకు నో్చుకోవడంలేదని, ఈ పరిణామం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు. కరాచీలో మీడియాతో మాట్లాడుతూ హఫీజ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ లో తమను అనుమతించే విషయమై పాక్ క్రికెట్ బోర్డు జోక్యం చేసుకోవాలని కోరాడు. ప్రపంచస్థాయి లీగ్ అయిన ఐపీఎల్ లో ఆడడం ద్వారా ఆటతీరు ఎంతో మెరుగవుతుందని చెప్పాడు.

'ఐపీఎల్ తొలి సీజన్ లో ఆడాను, ఆ తర్వాత దూరం పెట్టారు.గంగూలీ, పాంటింగ్ వంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం వల్ల యువ క్రికెటర్లకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. రాజకీయాలు, క్రీడలు ఎప్పుడూ ఒక్కటి కావు. వాటిని ఒకదానితో మరొకదాన్ని ముడిపెట్టరాదు' అని ఈ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా, తొలి సీజన్లో మాత్రమే పాక్ ఆటగాళ్ళు పాల్గొన్నారు. భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఇరుదేశాల క్రికెట్ పైనా ఆ ప్రభావం పడింది. అప్పటి నుంచి పాక్ క్రికెటర్లను ఐపీఎల్ వేలంలో పరిగణనలోకి తీసుకోవడంలేదు.

  • Loading...

More Telugu News