: తండ్రయ్యారా.. శృంగార వాంఛలకు విఘాతమే!
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుందని ఇప్పటి వరకు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ, పురుషులకూ ఈ ప్రమాదం ఉందని ఇండియానాలోని నోట్రే డేమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీ గెట్లర్ అంటున్నారు. ఫిలిప్పీన్స్ లో 433 మంది యువకులపై పరిశోధనలో ఈయన బృందం పలు విషయాలను గుర్తించింది. టెస్టో స్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న యువకుల్లో తండ్రి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అలాగే, ఒక బిడ్డకు తండ్రయ్యాక వారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతున్నట్లు గుర్తించారు. దాంతో శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుందని వారు చెబుతున్నారు. అయితే, ఇది తాత్కాలికమేనని గెట్లర్ చెప్పారు. పుట్టిన బిడ్డ పట్ల శ్రద్ధ వహించడానికి వీలుగా ఈ మార్పులన్నారు. తిరిగి ఏడాది లేదా రెండేళ్ల కాలంలో పురుషులలో టెస్టోస్టిరాన్ సాధారణ స్థాయిలకు చేరుతుందని చెప్పారు.