: నేపాల్లో అదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యం.. 18 మంది మృత్యువాత
నేపాల్లో నిన్న ఆచూకీ లేకుండా పోయిన విమానం పశ్చిమ ప్రాంతంలోని మాచినీలక్ పర్వతసానువుల్లో కుప్పకూలింది. ఈ ఉదయం విమానశకలాల్ని గుర్తించారు. ఇందులో ప్రయాణిస్తున్న 15 మందితో పాటు ముగ్గురు సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. నిన్న మధ్యాహ్నం పోఖారా విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఈ చిన్న విమానానికి గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విమానం కోసం గాలింపు చేపట్టారు. ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. అధికార వర్గాలు సంఘటన స్థలానికి వెళ్ళేందుకు యత్నిస్తున్నాయి. ఈ విమానం నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందినది.