: సమస్యలుంటే, నా చాంబర్ కు రండి.. మాట్లాడుకుందాం: స్పీకర్ మీరాకుమార్


కీలకమైన బడ్జెట్ సమావేశాలకు అంతరాయం కల్గించవద్దని సీమాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ పదేపదే విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో వీరు సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సభ మధ్యకు దూసుకువచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఇవే చివరి సమావేశాలైనందున అడ్డుకోవద్దని, సమస్యలుంటే మాట్లాడుకుందామని, తన ఛాంబర్ కు రావాలని స్పీకర్ వారికి సూచించారు. అయితే, సీమాంధ్ర మంత్రులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన ఆందోళనను కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News