: పాక్ లో భారత చిత్రాలకు నో ఎంట్రీ!
పాకిస్థాన్ భారత చిత్రాల ప్రదర్శనపై కత్తికట్టినట్లుంది. కొత్త చట్టం పేరుతో భారత చిత్రాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం ఆపివేసింది. దీంతో గుండే, హసీతో ఫాసీ చిత్రాలకు ప్రవేశం లేకుండా పోయింది. కొత్త నిబంధనలతో చట్టం తీసుకువస్తున్నందున.. అది ప్రభుత్వ ఆమోదం పొందే వరకు భారతీయ చిత్రాలకు నిరభ్యంతర పత్రాలను జారీ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు అక్కడి సమచార, ప్రసార శాఖ ప్రకటన జారీ చేసింది. భారతీయ చిత్రాలను అనుమతిస్తూ 2006లో పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున సినిమా థియేటర్లు వెలిశాయని, తాజా నిర్ణయంతో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని సినీ పంపిణీదారు సిద్దిఖి ఆందోళన వ్యక్తం చేశారు.